తెలంగాణలో న్యాయవాద దంపతులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యత కలిగిన పరిణామం. జనగామ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులపై వేటు వేయడం జరిగింది.జనగామ ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డిని మరియు ఎస్ఐ తిరుపతిని బదిలీ చేయడం జరిగింది.కానిస్టేబుల్ బి.కరుణాకర్‌ను ఏఆర్‌కు అటాచ్ చేయడం జరిగింది.బాధితురాలి వివరాలు తెలుసుకునేందుకు న్యాయవాద దంపతులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లినప్పుడు, పోలీసులు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాద సంఘాల నిరసనల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్‌లపై చర్యలు తీసుకోవడం జరిగింది.

