పి వి పురం:సత్యవేడు మండలం పి వి పురం జడ్పీ హైస్కూల్ ఎంపీపీ పాఠశాలలో ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గా ఎన్నికైన వారు ఆయా పాఠశాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయలని అలాగే పూర్వ విద్యార్థుల దాతల సహకారం తీసుకుని పాఠశాలకు కావలసిన మౌలిక వసతులకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలంకు మంచి పేరు తీసుకురావాలని టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొండురు బాలరాజు పేర్కొన్నారు.
ఎస్ఎంసి జడ్పీ హైస్కూల్ చైర్మన్ గా వెంకటేష్ , చమర్తి కండ్రిగ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా సురేష్, ఓబుల్ రాజు కండ్రిగ ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా సతీష్ లకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

