Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుమార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం పూర్తి చేయాలి

మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం పూర్తి చేయాలి

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ డిమాండ్
ప్రజాభూమి మార్కాపురం

మార్కాపురం ఎస్ఎఫ్ఐ మార్కాపురం డివిజన్ స్థాయి సమావేశం స్థాని ప్రెస్ క్లబ్ నందు జిల్లా అధ్యక్షులు కె. విజయ్ అధ్యక్షతన జరగ్గా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ పాల్గొని మాట్లాడుతూ.ప్రకాశం జిల్లాను కేంద్ర ప్రభుత్వం వెనకబడిన జిల్లాగా గుర్తించింది ఆప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం ఇంకా వెనుకబడి ఉన్నది.జిల్లా వెనుకబాటు తనం నుండి పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయాలంటే విద్యారంగంలో అభివృద్ధి సాధించాలని కోరారు.
ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల ప్రజలు విద్యా, వైద్య అవసరాల కోసం కర్నూలు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాలకు రావాల్సిందే. ప్రధానంగా వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాయవరం వద్ద దాదాపు 50 ఎకరాల స్థలాన్ని సేకరించి వైద్య కళాశాల, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 500 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించింది మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించి వెంటనే పూర్తిచేసే 2025 విద్యా సంవత్సరం నుండి క్లాసులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం.జిల్లాలో అత్యధిక విద్యార్థులు ఉన్న హై స్కూల్ గా మార్కాపురం బాయ్స్, గర్ల్స్ స్కూల్స్ ఉన్నవి.
ఈ సంఖ్యకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్ళు లేనందున విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే హాస్టల్స్ సంఖ్యను పెంచాలి.
అత్యంత ప్రాముఖ్యత, చరిత్ర కలిగిన ఎస్వికెపి కాలేజీని పున ప్రారంభించి యధావిధిగా తరగతులు జరిగే విధంగా చొరవ తీసుకోవాలి.ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ పీజీ కళాశాలను ఈప్రాంతంలో ఏర్పాటు చేయాలి.
ఏ డిమాండ్ల సాధన కోసంభవిష్యత్తులో పోరాటం నిర్వహించాలని కోరారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి మెదక్ రఫి మాట్లాడుతూ
పాలకుల నిర్లక్ష్యం కారణంగా అచ్చం ప్రకాశం బాగా వెనకబడిందని ఈ ప్రాంతంలో విద్య,వైద్యం, ఉపాధి రంగాలలో అభివృద్ధి చేయడం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్లు సమస్యల్లో ఉన్నాయి పరిష్కరించే దిశగా అధికారులుచొరవచూపాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article