బుట్టాయగూడెం. :ఆంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని దొరమామిడి సమీపంలోని కోయిదా ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితులు కోరారు. ఆదివాసి హక్కులు, చట్టాలు పరిరక్షణ స్పూర్తితో గురువారం దొరమామిడి సమీపంలోని కోయిదా కాలనీలో ఆదివాసీ కొండరెడ్లు, ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీ వాసులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్వాసితుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ, ప్రభుత్వ ఆధికారుల నిర్లక్ష్యంపై నిరసన తెలిపారు. పునరావాస కాలనీ వాసులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్వాసితుల సమస్యలు శాశ్వత పరిష్కారం నోచుకోలేక, నిరాశ్రయులై ఉన్నామని అవేదన వ్యక్తం చేశారు. పునరావాస కాలనీలకు నిర్వాసితులు వచ్చినప్పటికి నేటి వరకు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు, కాలనీలలో సమస్యలు పరిష్కారించుటంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని వాపోయారు. గత ప్రభుత్వంలో నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యము జరిగిందని ఇప్పటికైన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. వెంటనే స్పదించి 41:15 కాంటూరు పరిదిలో గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ పెండింగ్ ప్యాకేజిలు, ఇళ్ళ వేల్యువేషన్ ఇతర ప్యాకేజి లతో పాటు వేలేరుపాడు మండలంలో కాంటూరు పరిదిలో లేని ముంపు గ్రామాలను 41.15 కాంటూరు పరిధిలో కలిపి అన్ని రకాల పునరావాస ప్యాకేజిలను నిర్వాసితుల ఖాతాలో జమ చేయాలని కోరారు. నిర్వాసితులకు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించి, వేలేరుపాడు మండల నిర్వాసితులకు న్యాయం చేసి పునరవాస కాలనీ ప్రాంతాలకు తరలించాలని అన్నారు. కోయిదా పునరావాస కాలనీలో
స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని,. కాలనీ పై ఉన్న గంగమ్మ చెరువు కట్ట మరమత్తులు చేయాలని, దొరమామిడి, కోయిదా పునరావాస కాలనీకి మద్య ఉన్న రహదారిలో కుంగి పోయిన చప్టాను తిరిగి నిర్మించాలని, 2017కటాప్ డేట్ రద్దు చేసి కొత్త జి .ఓ అమలు చేసి పునరవాస ప్రాంతానికి వచ్చేనాటికి 18సం”నిండిన వారికి ప్యాకేజి వర్తిపజేయాలని,.భారీవర్షం కారణంగా కాలనీలో తలెత్తిన సమస్యలు పరిష్కరించి, తగిన సౌకర్యాలు,సదుపాయాలు కల్పించి , ముంపు, వరద ఆర్ధిక భృతి కల్పించాలని, కాలనీలలో శ్లాబులు మరమ్మతులు చేయించాలని కోరారు.

