Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుడెంటల్ ల్యాబ్ ను తెరవాల్సిందే..

డెంటల్ ల్యాబ్ ను తెరవాల్సిందే..

ప్రభుత్వాసుపత్రి ఎదుట రాజకీయ పార్టీల ఐక్యవేదిక నిరసన
హిందూపురం టౌన్
జిల్లా స్థాయి హోదా కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో డెంటల్ ల్యాబ్ ను వెంటనే కలవాలని రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ల్యాబ్ ను వెంటనే తెరవాలని గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రోహిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో కృత్రిమ పళ్ళు తయారుచేసి అమర్చే సౌకర్యం కేవలం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే అందుబాటులో ఉండేదన్నారు. అయితే గత ఏడాది కాలంగా ల్యాబ్ ను తెరవడం లేదన్నారు. దీంతో పేద ప్రజలకు దంతువైద్యం అందడం లేదని, నొప్పి భరించలేని పరిస్థితులు అప్పు లు చేసి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాబ్ లో పనిచేసే సాంకేతిక సహాయకుడు తనకు పని రాదని చెప్పడంతో ఈ ల్యాబ్ ను మూసి వేయడం జరిగిందన్నారు. అన్ని వసతులు ఉన్నా కేవలం ఒక ల్యాబ్ సాంకేతిక సహాయకుడి అసమర్ధత వల్ల పేద ప్రజలు వేలాది రూపాయలు ప్రైవేటు ఆసుపత్రిలో వ్యయం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఇలాంటి పరిస్థితులు కల్పించిన సంబంధిత సాంకేతిక సహాయకుడి పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వెంటనే మూతపడిన డెంటల్ ల్యాబ్ ను తెరవాలని కోరారు. అదే విధంగా సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ కిరణ్, బీఎస్పీ పార్టీ శ్రీరాములు, ఆర్ఎస్పీ పార్టీ ఏ. శ్రీనివాసులు, ఎంఐఎం పార్టీ మున్నా, ఏపీ ఆర్ ఎస్ పార్టీ కోడుమూరి నౌషాద్, కలీం, ఎం.ఎల్. నారాయణ మద్దిలేటి, సుబ్బన్న, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article