మార్కాపురం :మార్కాపురం స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి.పర్యవేక్షులుగా హాజరైన గౌరవ మార్కాపురం ఉపవిద్యాశాఖ అధికారి ఎ.చంద్రమౌళిశ్వర్ తల్లిదండ్రులు లను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాఠశాల యాజమాన్య కమిటీ ఆవశ్యకత.భాధ్యతలను వివరించి. ఎన్నిక ప్రక్రియలో భాగస్వామ్యం వహించిన తల్లిదండ్రులను అభినందించారు
ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలో చైర్మన్ గా మంకు ఏడుకొండలు.వైస్ చైర్మన్ గా షేక్ ముంతాజ్ బేగం ఎన్నికయ్యారుకో ఆప్టెడ్ సభ్యులుగా చలువాది మురళి ..కప్పగంతుల మధుసూదన్ శాస్త్రీ ఎంపిక అయినట్లు పాఠశాల యాజమాన్య కమిటీ కన్వీనర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలియజేసారు.పాఠశాలలో మౌళిక వసతుల కల్పనలో భాగంగా స్కూల్ ఇన్ ఫ్రా ఇంప్రుమెంట్ పోగ్రామ్ లో భాగస్వామ్యం హహించి త్వరలో పనులు పూర్తి చేసి పాఠశాలను ప్రగతి పథంలో నడిపించడంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలియజేసారు.


