ప్రజా భూమి, కామవరపుకోట
కామమవరపుకోట మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు నందు భారత రాజ్యాంగ దినోత్సవం(నవంబర్ 26)(జాతీయ న్యాయ దినోత్సవం )కార్యక్రమం ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొడ్డు రాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమమునందు విద్యార్థులచే రాజ్యాంగ ప్రవేశిక (పీఠిక)చెప్పించి, భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగం పై నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మొక్కలు బహుమతులుగా ఇచ్చినారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు బిరుదుగడ్డ నాగేశ్వరరావు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలలోకన్న అత్యుత్తమమైనది. నేడు మన ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి రాజ్యాంగంమే కారణం, ప్రజలందరూ సమానమే అని తెలిపియున్నారు.కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొడ్డు రాములు,సత్యనారాయణ,ప్రసాద్,బాలాచలం,పల్లాలు, రమేష్,రాధాకృష్ణ,మురళి,విజయకుమారి,గీతాదేవి,సుజాత,జయశ్రీ,శారద,చైతన్య,బాలాజీ పాల్గొన్నారు