మార్కాపురం:మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో పట్టణ అధ్యక్షుడు షేక్ అమీర్, కార్యదర్శి పి అయూబ్ ఖాన్ అధ్యక్షతన పట్టణ యంపీజే కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ యుండి ఖదీర్, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు షేక్ రసూల్, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాశిం లు మూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు శక్తిని తమ వద్ద కేంద్రీకృతం చేసుకుని తమకు ఇష్టమైనరీతిలోపరిపాలిస్తున్నాయని, యంపీజే ప్రజల ఇష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోచైతన్యం.తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. అదేవిధంగా యంపీజే నిరంతరం ప్రజల అవసరాలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుందని, అవసరమైతే వాటిని పరిష్కరించడానికి ప్రెజర్స్ గ్రూపుగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే దేశంలో, రాష్ట్రంలో శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తుందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ నిర్వహిస్తుందని, పీడితులకు అండగా ఉంటూ, అవినీతికి వ్యతిరేకంగా, అన్యాయం జరిగిన వారికి న్యాయం ఇప్పించెందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా మార్కాపురం పట్టణ కమిటీని సభ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మార్కాపురం పట్టణ అధ్యక్షుడుగా షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులుగా సయ్యద్ మస్తాన్ వలి, షేక్ అబ్బాస్, ప్రథాన కార్యదర్శిగా పఠాన్ హబీబుల్లా ఖాన్, కోశాధికారిగా షేక్ జవాద్ అహ్మద్, ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. తదనంతరం ఇస్లాం పేట మస్జిద్ ఎదురుగా ఉన్న నూతన యంపీజే ఆఫీస్ ను సామాజిక వేత్త, రిటైర్ పోస్టల్ ఉద్యోగి షేక్ నజీర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మార్కాపురం పట్టణ యంపీజే కార్యకర్తలు పాల్గొన్నారు.

