ప్రజా భూమి జగ్గంపేట
జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన అన్న క్యాంటీన్ కార్యక్రమంలో పాల్గొని తన స్వగ్రామం గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (యల్లమిల్లి సీఎం) మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హుటాహుటిన జగ్గంపేట సాయి హాస్పిటల్ కు తరలించారు కుడివైపు తుంటి భాగం విరిగిపోవడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సాయి హాస్పిటల్ కి వెళ్లి యల్లమిల్లి సీఎంను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. రేపు ఉదయం శస్త్ర చికిత్స చేస్తామని డాక్టర్లు తెలియజేశారు. మారిశెట్టి భద్రం, ముండ్రు ఎర్రబాబు, మండపాకఅప్పాన్నదొర, మాదిరెడ్డి కృష్ణార్జున,మద్దిపూడి వీర వెంకట సత్యనారాయణ, దేవిశెట్టి బాబ్జి, సుంకవిల్లి సాయిబాబా, పాక అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

