లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 10 గంటలకు వెలగపూడి రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో 26 జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ …. ఈ సదస్సు చరిత్ర తిరగరాయబోతోందన్నారు. ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి.. ఆనాటి సిఎం జగన్ కూలగొట్టేశారనీ, విధ్వంసం సృష్టించారని చెప్పారు. పని చేసే అధికారులను పక్కన పెట్టారనీ, బ్లాక్‌మెయిల్ చేశారనీ ధ్వజమెత్తారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారుతాయని, మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఉంటాం అని చంద్రబాబు అన్నారు. ఈ సదస్సులో పలు కీలకాంశాలపై సిఎం కలెక్టర్లతో చర్చించనున్నారు.