Friday, November 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఉచిత టెట్+డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఉచిత టెట్+డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

హాజరైన శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జగ్గంపేట, ప్రత్తిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ,

జగ్గంపేట :స్థానిక గోకవరం రోడ్ లో గల కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఉచిత టెట్+డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షాగిల్, టెట్, డీఎస్సీ బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యఅతిథిలుగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ, పిఠాపురం, జగ్గంపేట జనసేన ఇన్చార్జ్ లు మారిడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ దాట్ల కృష్ణ వర్మ ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవ నిరథితో మంచి కార్యక్రమం తీసుకున్నారని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని టీచర్లుగా ఉద్యోగాలు సాధించాలని అన్నారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజా నాయకుడిగా ప్రజా సేవా కార్యక్రమాలు చేయడంలో నెహ్రూ ముందుంటారని అందులో భాగంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకుని 432 మంది టీచర్లుగా ఉద్యోగాలు సాధించేందుకు వారికి ఉచిత కోచింగ్ ఇవ్వడమే వారికి అన్ని వారికి అన్ని వసతులు కల్పిస్తున్నారని అన్నారు. నెహ్రూ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా నియోజవర్గ అభివృద్ధి కోసం అనేక కోరికలు కోరుతుంటారని వీటిని సాధించేందుకు నా వంతు సహకారం అందిస్తానని అన్నారు. నెహ్రూ, నవీన్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల క్రితం నరేంద్ర పట్నం గ్రామంలో యనమల రామకృష్ణుడు చేతులు మీదుగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగిందని అప్పటినుంచి స్కూల్స్ కి బెంచీలు బల్లలు ఫ్యాన్లు అనేక మౌలిక వసతులు మా కార్యకర్తల సహకారంతో కల్పిస్తున్నామని అదేవిధంగా నియోజకవర్గంలో ఎప్పటినుంచో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆశ్రమాన్ని కూడా త్వరలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్న ఈ కోచింగ్ సెంటర్ ను ప్రారంభించాలని నాన్న నెహ్రూ ఆలోచన కార్యరూపం దాల్చి ఈరోజు ఎంతమందికి ఉచిత కోచింగ్ తో పాటు భోజనం వసతి కూడా కల్పించడం జరుగుతుందని నవీన్ అన్నారు. అక్షరా కాలేజ్ ప్రిన్సిపాల్ నీలం చక్రధర్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ సెంటర్ ను ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కోచింగ్ ఇప్పించి గోదావరి ఇనిస్ట్యూట్ వారి ఫెకాలిటితో కోచింగ్ ఇప్పిస్తున్నామని ఈ 432 మంది కూడా టీచర్లుగా ఉద్యోగాలు సాధించాలని నా కోరిక అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, కోర్పు లక్షయదొర, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, చదరం చంటిబాబు, మంగ రౌతు రామకృష్ణ, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కుంచే రాజా, సర్పంచ్ బచ్చల నాగరత్నం, అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్: జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెట్ డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article