కామవరపుకోట :అంబేద్కర్ కాలనీవాసులకు వేళ్లపట్టాలేవాలంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలు జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామంలో పాతూరు అంబేద్కర్ కాలనీ కానలిలో గత 40 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుంటున్న ఎస్సీ దళితులు ఉన్నారన్నారు. ఇల్లు నిర్మించుకొని దళితులు పంచాయతీ పన్నులు , కరెంటు బిల్లులు కడుతున్నారని ఈ ప్రాంతంలో సిసి రోడ్లు నిర్మించారు. కానీ వీళ్ళకి ఇప్పటివరకు ఇంటి పట్టాలు మంజూరు చేయకపోవడం దళితుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం అని అన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి కామవరపుకోట ఎస్సీ పాతపేట కాలనీ పరిశీలించి పట్టాలి ఇవ్వాలని ఏ ఫ్రాన్సిస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఐక్యం చేసి ఉద్యమిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ప్రభుత్వం ఎస్సీలు పట్ల చిత్తశుద్ధి తో వ్యవహరించాలని లేనిపక్షంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం గా మిగిలిపోవాల్సి వస్తుందని ఏ ఫ్రాన్సిస్ అన్నారు .ఈ నిరసన కార్యక్రమంలో దుర్గారావు ఎం వీరయ్య చిన్న దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

