ప్రజాభూమి విజయవాడ బ్యూరో
విశాఖలో మంత్రులు, సచివాలయ శాఖల కార్యాలయాల వసతికి ప్రభుత్వ భవనాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. మిలీనియం టవర్లలో మంత్రులు, సీనియర్ అధికారుల క్యాంపు కార్యాలయాలు ఉంటాయని అంటున్నారు. 16 శాఖలకు వివిధ ప్రాంతాల్లో భవనాలు కేటాయింపు చేశారు. విశాఖలో ఏ శాఖ కార్యాలయం ఎక్కడ రానుందనే విషయాన్ని సూచన ప్రాయంగా తెలియజేశారు. వ్యవసాయ, సహకార శాఖను ఎండాడ, పీఎం పాలెం పోస్ట్ వద్ద, పశుసంవర్ధక శాఖ,మత్స్య శాఖ హనుమంతవాక,ఆదర్శ్ నగర్లో,
వైద్యారోగ్య శాఖ హనుమంతవాకలో, హోంశాఖ కృష్ణా నగర్, మహరాణిపేటలో పరిశ్రమల శాఖ గవర కంచరపాలెంలో పట్టణాభివృద్ది శాఖ దుర్గానగర్, అరిలోవ, ఎంవీపీ కాలనీ, పెందుర్తి, మద్దిల పాలెం,సిరిపురం సర్కిల్లో, దేవదాయశాఖ సింహాచలంలో, పాఠశాల విద్యాశాఖ భీమునిపట్నంలో, రవాణా,రోడ్లు-భవనాలు మర్రిపాలెంలో, గిరిజన సంక్షేమ శాఖ రుషికొండలో నిర్ణయించారు.
అధికారుల నివాసాలకు..
ఫారెస్ట్ గెస్ట్ హౌస్ – విశాలాక్షి నగర్, పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ గెస్ట్ హౌస్ – కైలాసగిరి,
జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ – పెద వాల్తేరు, టూరిజం గెస్ట్ హౌస్ – హరిత రిసార్ట్స్.
మిలీనియం టవర్స్ లో ఏర్పాటుచేసే క్యాంప్ ఆఫీసులివే
జీఏడి, ఇంధన,ఆర్ధిక శాఖ, ప్లానింగ్, న్యాయశాఖ, ఉన్నతవిద్యా శాఖ, గృహనిర్మాణ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ,కార్మికశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్,ఆర్టీజీఎస్ కార్యాలకు కేటాయించారు.