అమరావతి నిర్మాణానికి 25 ఎకరాల భూమి త్యాగం
ప్రజాభూమి విజయవాడ బ్యూరో:
రాజధాని నిర్మాణంలో తన వంతుగా భూములు త్యాగాలు చేసిన రైతులు మనోవేదనతో మృతి చెందుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి 25 ఎకరాల భూమిని త్యాగం చేసిన మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన నన్నపనేని రాంబాబు (52) లు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన భౌతిక కాయానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య శనివారం ఉదయం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేసిన దగ్గర నుండి రాజధాని రైతుల ఆందోళనలో పాల్గొంటూ ఉండేవాడని, ఈ క్రమంలో విశాఖపట్నం కి రాజధానిని తరలిస్తున్నారని తీవ్ర మనో ఆవేదనకు గురయ్యాడుఅని. స్థానిక రైతులు తెలిపారు. రాజధాని నిర్మాణానికి తమ భూములు త్యాగంచేసిన రైతులు అనేక మంది మృతి చెందుతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యహరిస్తుందని రైతులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ముసునూరి సుహాస్, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వర్రావు సిపిఐ సీనియర్ నాయకుల గౌహర్ జానీ తదితరులు నివాళులర్పించారు.