వైసీపీ అధినేత జగన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. జగన్ కు ఇంకా తత్వం బోధపడలేదని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో చోటుచేసుకున్న గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. అవాస్తవాలను చెపుతూ కుట్రలకు తెర లేపుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికీ తానే సీఎం అని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం సీఎంగానే ఉంటాననే భ్రమల్లోంచి జగన్ ను ప్రజలు బయటపడేశారని చెప్పారు. చంద్రబాబుకు తాను, తమ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర పురోగతికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా మద్దతిస్తామని చెప్పారు.