కాకినాడ రూరల్ :స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కరప మండలం కరప గ్రామం చిరంజీవి కళ్యాణ మండపంలో మండల విద్యాశాఖాదికారులు కృష్ణవేణి,సత్యనారాయణల అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వంచే అందించే స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ కరప మండలంలోని 67 పాఠశాలలకు గాను 5102 విద్యార్థులకు రూ. 1,23,41,738/- లక్షల రూపాయలు విలువచేసే స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేశారు.అకాల వర్షాలకు గాను పాఠశాలకు సెలవులు ఉన్నప్పటికీ స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు అభినందలు తెలిపారు..
ఈ సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రానున్న రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు,అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాద్యాయులు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ పార్టీ కూటమి నాయకులు జన సైనికులు, వీర మహిళలు తదితర నాయకులు పాల్గొన్నారు.

