Thursday, May 1, 2025

Creating liberating content

హెల్త్హార్ట్ ఎటాక్ లక్షణాలు కాళ్లలో కూడా కన్పిస్తాయా?

హార్ట్ ఎటాక్ లక్షణాలు కాళ్లలో కూడా కన్పిస్తాయా?

గుండె వ్యాధుల లక్షణాలంటే చాలామంది ఛాతీలో నొప్పి, మెడ నొప్పి, ఎడమ చేయి నొప్పి, వాంతులు లేదా వికారంగా ఉండటం మాత్రమే అనుకుంటారు. కానీ ఇంకొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. మీకెప్పుడైనా ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అది కాళ్లలో కన్పించే మార్పు. ఆశ్చర్యంగా ఉందా..అవును గుండె వ్యాధికి సంబంధం కాళ్లతో కూడా ఉంటుంది.కాళ్లలో కన్పించే మార్పును పసిగట్టగలిగితే గుండె వ్యాధుల్ని ప్రారంభదశలోనే నిర్ధారించవచ్చు. ప్రాణాంతక పరిస్థితుల్నించి కాపాడుకోవచ్చు. గుండె వ్యాధి సమస్యలకు కాళ్లలో ఎలాంటి లక్షణాలు లేదా మార్పులు కన్పిస్తాయో పరిశీలిద్దాం. కొంతమందికి కాళ్లు తరచూ నొప్పి పడుతుంటాయి. మరీ ముఖ్యంగా రాత్రి వేళ ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. నడవడానికి సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇది గుండె వ్యాధులకు సంకేతం కావచ్చు. కాళ్లకు రక్త సరఫరా సరిగ్గా కాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది. కాళ్ల రంగు మారి పసుపుగా ఉన్నా లేదగా నీలంగా ఉన్నా గుండె వ్యాధి ముప్పు పొంచి ఉందని అర్ధం. శరీరంలోని అన్ని అంగాలకు రక్త సరఫరా సరిగా అవడం లేదని అర్ధం. అంటే గుండెలో ఏదో సమస్య ఉందని అర్ధం. కాళ్లకు ఏదైనా గాయమై ఉండి అవి త్వరగా మానకపోతే గుండెలో సమస్య ఉందని అర్ధం. ఇది కూడా రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో కూడా గాయాలు త్వరగా మానకపోవడం కన్పిస్తుంది. కాళ్లపై ఉండే జుట్టు రాలిపోవడం లేదా తగ్గిపోవడం కూడా ఆందోళన కల్గించే అంశమే. శరీరంలోని అన్ని అవయవాలకు సరిగ్గా రక్తం సరఫరా కాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది. గుండె పనితీరు మందగిస్తే ఇలా జరగవచ్చు. కాలి గోర్లు కూడా త్వరగా పెరగవు. గోర్ల రంగు మారుతుంటుంది. ఇది రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. గుండె సరిగ్గా పనిచేయడం లేదని అర్ధం చేసుకోవచ్చు.ఈ లక్షణాలన్నీ కేవలం గుండె సంబంధమైన సమస్యలకే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలున్నప్పుడు ఎదురు కావచ్చు. అందుకే ఈ లక్షణాలున్నప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article