Sunday, February 15, 2026

Creating liberating content

సాహిత్యంరియల్ రాయల్ బెంగాల్ టైగర్!

రియల్ రాయల్ బెంగాల్ టైగర్!


జ్యోతిబసు జయంతి
++++++++++++++++
రియల్ రాయల్
బెంగాల్ టైగర్!


(సురేష్..9948546286)

✍️✍️✍️✍️✍️✍️✍️

జనం చేత ఎప్పుడూ
ఇక బస్సు బాసూ
అనిపించుకోని బసు..
ఏకధాటిగా ఇరవై మూడేళ్లు
అదే కుర్చీలో..
దేదీప్యమాన “జ్యోతి”లా..
అఖండ ఖ్యాతితో..!

పశ్చిమ బెంగాల్..
జ్యోతి బసు..
బొమ్మా బొరుసా
అనలేదు జనం..
బసునే మా బాసు..
ఆయనే సెభాసు..!

ముఖ్యమంత్రి అయ్యాక..
అవ్వక మునుపు కూడా కేసులున్న నేతల రాజ్యంలో
బసు కెరీర్లో అవినీతి పూజ్యం
అందుకే ఆయనకు
సదా రాజపూజ్యం..!

ప్రధాని పదవి రేసులోనూ
బసు..అప్పుడే తిరకాసు..
పార్టీ పాలసీ..
ఆపేసింది లెగసీ..
లేదంటే తొంభై ఏడులోనే
ఈ రేడు అయ్యేవాడు
హస్తినలో తిరుగులేని
నాయకుడు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article