సినిమా'లైలా'గా వ‌స్తున్న విష్వక్సేన్.!

‘లైలా’గా వ‌స్తున్న విష్వక్సేన్.!

టాలీవుడ్ యువ హీరో విష్వక్సేన్ కొత్త చిత్రం బుధ‌వారం పూజ కార్య‌క్ర‌మంతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. లైలా అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ చిత్రం కొత్త డైరెక్ట‌ర్‌ రామ్ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఇది విష్వక్సేన్ హీరోగా 12వ చిత్రం. ఈ సినిమాలో విష్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ లాంచ్ చేశారు. కాగా, ఈ పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కే రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న‌ ముహూర్తం క్లాప్ కొట్టగా.. ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఇక విష్వక్సేన్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ న‌టిస్తోంది. తనిష్క్‌ బాగ్చి బాణీలు అందిస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article