- ఏపీసిసి మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి
వేంపల్లె :ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 65.31 లక్షల మందికి రూ. 4408 కోట్లు సామాజిక పింఛన్ ను లబ్ధిదారులకు ఇంటి వద్దకే పంపిణీ చేయడం హర్షణీయమని, అయితే హామీలు ఎప్పటి నుండి అమలు చేస్తారన్న విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. యువగళం కింద నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు, అన్నదాత సుఖిభవ కింద ప్రతి ఏటా రైతుకు రూ. 20 వేలు, వయోపరిమితి కలిగిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500, ప్రతి ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే ఫించన్ హామీలను కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందన్నారు.

