Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలునివాసాలలోకి దూసుకెళ్లిన లారీ

నివాసాలలోకి దూసుకెళ్లిన లారీ

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల సమీపంలో పరాకు వాండ్లపల్లిలో సోమవారం తెల్లవారుజామున ఒక లారీ నివాసాల్లో కి దూసుకెళ్లింది. సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు . అదేవిధంగా ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా రెండు మూడు నివాసాలు నేలమట్టమయ్యాయి.డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని దాటుకొని లారీ మరి ఇళ్లల్లోకి వెళ్లడం జరిగింది. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. సంఘటన స్థలానికి తనకల్లు పోలీసులు చేరుకొని, లారీ డ్రైవర్ ను శిథిలాలలో నుంచి బయట కు తీసి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐతే డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించి నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article