ప్రజాభూమి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం యోగుల పర్వతంపై నిర్వహించే కార్తీక దీపానికి సర్వం సిద్ధం చేసినట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి అన్నారు. ఈనెల 26వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1550 కిలోల ఆవు నెయ్యి తో సుమారు 30 కిలోమీటర్లు కనిపించే మేరా కార్తీకదీపం ను వెలిగించినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం యోగుల పర్వతంపై ఉన్న శ్రీ సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలాగే సుబ్రహ్మణ్యం స్వామికి నాగదేవతలకు పూజలు ఉంటాయన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు కొరకు పలువురిచే భజనలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు యోగులు పర్వతం పైకి వచ్చే భక్తులకు దారి పొడుగునా త్రాగునీరు, పర్వతంపై నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. కావున భక్తులందరూ ఈ యొక్క కార్తీక దీపం లో పాల్గొని, జ్యోతిని దర్శించి కార్తీక దామోదర అనుగ్రహం పొందాలన్నారు.