Saturday, September 13, 2025

Creating liberating content

టాప్ న్యూస్బీసీలకు టీడీపీ పెద్దపీట

బీసీలకు టీడీపీ పెద్దపీట

• టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు
• టీడీపీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం
• కార్యకర్తలు ఏ సమస్య ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి విన్నవించుకోవచ్చు
• ప్రతి కార్యకర్త సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
• పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి
• త్వరలోనే టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల తొలగింపు కృషి
• టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

టీడీపీ అంటే బీసీలు… బీసీలు అంటే టీడీపీ అని మరోసారి సీఎం చంద్రబాబు రుజువు చేశారు. టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీలకు పెద్ద పీట వేస్తూ… టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నేత గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అప్పగించడంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షపదవిని కార్యకర్తల సమక్షంలో గౌరవ ప్రదంగా స్వీకరించారు. నేతలు, నాయకులు కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను అప్పగించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పదవీ బాధ్యతలను నిర్వహిస్తానని తెలిపారు. పవిత్రమైన సంకల్పంతో నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టికి తనను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అధినేత తనకు దిశానిర్ధేం చేసిన విషయాలను తూచ తప్పకుండా.. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేలా.. నామినేటెడ్ పదవులతో ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందు తీసుకెళ్లడమే తన ప్రధానమైన బాధ్యతగా తెలిపారు.

పార్టీని అధికారంలోకి తీసుకు రావాడనికి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా... వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని ఓర్చుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అధినాయకుడి ఆదేశాలను ముందుకు తీసుకెళ్తూ కృషి చేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత పాలనవ్యవస్థలో నిమగ్నమై నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడంలేదన్న ఆలోచన వారిలో ఉంది. అటువంటి విమర్శకు తావులేకుండా పార్టీని నాయకులును ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ.. 2029 కి ఇదే మెజార్టీతో గెలిచేలా కృషి చేస్తానన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు తెలియజేసేది ఒక్కటే.. మేము అనుక్షణం మీతోనే ఉంటాం.. మీ బాధ్యత మాది అని పల్లా అన్నారు. నేడు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏమి ఆశించకుండా పార్టీ కోసం వారి సమయాన్ని చంద్రబాబు సిద్ధాంతాలను ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేశారు. నేను మీకోసమే ఈ పదవిని తీసుకున్న..  కార్యకర్తలకు న్యాయం చేయకుంటే నేను నా పాత్ర సక్రమంగా చేయనట్లు భావిస్తా... ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా... ఏ పని ఉన్నా పార్టీ కార్యాలయానికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తా. ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి. అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి విఘాతం కలింగించేలా వ్యవహరించకూడదు. మనమందరం ప్రజాస్వామ్యవాదులం. మన మూలాలు ప్రజాస్వామ్యం.

గత ప్రభుత్వం అధికారాన్ని అపహాస్యం చేస్తూ... ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతూ.. కేవలం ప్రతిపక్ష నేతలను అనగతొక్కడానికే అధికారాన్ని వినియోగించారు. అందుకే వైసీపీకి బుద్ధి చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రయోజనాలకోసం పనిచేయాలి. రాజకీయ ప్రేరేపిత కేసులను మూడు నెలల్లో తీయించేలా కృషి చేస్తాం. ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టులో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసులను సంత్సరంలో తొలగించేలా కృషి చేస్తాం. ప్రతి నాయకుడు కూడా  ఏ నాయకుడు మీద కేసులు ఉన్నాయో పార్టీ దృష్టికి తీసుకు రావాలి. 

మనం వారి లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. చట్టాలకు అనుగుణంగా  అధికారం దుర్వినియోగం చేసిన వారికి బుద్ధి చెబుతాం. నేడు ప్రజలు చంద్రబాబు నాయుడు యొక్క కష్టాన్ని చూసి యువనాయకుడు లోకేష్ యొక్క యవగళాన్ని చూసి కూటిమిలోని నాయకులు సహాయ సహకారాలు చూసి అధికారం ఇచ్చారు. మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేయాలి. ముఖ్యంగా బలహీన వర్గాలను, వెనకబడిన వర్గాలను, అనగారిన వర్గాలను సమసమాజం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉంది. సామాజిక సమతుల్యతను చూసుకుని ముందుకు వెళ్దాం. 

పార్టీ బలోపేతానికి యువనాయకత్వాన్ని ఆహ్వానించాలి. యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మన మనుగడ ఉండాలంటే యువత మనతో అడుగులు వేయాలి. యువతను ఆకర్షించాలి. లోకేష్ బాబు ఆలోచనలను గౌరవించాలి. సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తూనే యువతను ప్రోత్సహించాలి. యువనాయకత్వం చట్ట సభల గురించి తెలుసుకోవాలి. చట్టసభల్లో చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నాయకుడు సమాజ గమనాన్ని గుర్తించాలి. దాన్ని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాలి. అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టాకే బడుగు బలహీన వార్గాలకు రాజకీయ ప్రాధాన్యత దక్కింది. సమసమాజ స్థాపన జరిగింది. ఉద్యోగ అవకాశాలు, ఇన్ఫాస్ట్రక్చర్, మానవ వనరుల అభివృద్ధి, భవిష్యత్ తరాల బాగుకోసం పరితపించే చంద్రబాబు ఆశయాలకనుంగా పనిచేయాలి. ఇంట్లో కూర్చుంటే సరిపోదు నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలని సుమారు 3 వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ నుండి యువత నాయకత్వ విలువలను నేర్చుకోవాలి. అప్పుడే ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. గత దుర్మార్గపు పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ఈరాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాలి. పోలవరంతోపాటు, అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ, రాయలసీమలను అభివృద్ధి చేసుకోవాలి. అధినాయకత్వంతో మమేకమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు, దన్యవాదాలు తెలుపుతున్న అని పల్లా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article