ఢిల్లీ : 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ఉచిత చికిత్స అందించబడుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రకటించారు. ఉభయ సభలనుద్దేశించి నేడు ఆమె ప్రసంగిస్తూ దేశంలో 25,000 జన్ ఔషధి కేంద్రాల ప్రారంభోత్సవం శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయని ముర్ము అన్నారు. ఇక నుండి 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ కూడా ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఉచిత చికిత్స యొక్క ప్రయోజనం పొందనున్నారని రాష్ట్రపతి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌గా ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పేర్కొన్నారు. ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹5 లక్షల ఆరోగ్య రక్షణను అందించనుంది.