సంపూర్ణ సమగ్ర సహకారంతో స్టేజ్ నిర్మించిన రోటరీ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు
శత సహస్ర వసంతాలు పాటు పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా..
.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు :విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్ బుక్స్ గల కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లితండ్రులు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని చిన్నతనంలో క్రమశిక్షణను అలవర్చుకుంటామని, జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఎంతో తోడ్పాటు నిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానములో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లేనన్ని మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తుందని ఆ దిశగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నామన్నారు.
జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల క్రీడా కార్యక్రమాల నిర్వహణకు చక్కని క్రీడా స్థలం ఉందన్నారు. నిన్నటి వరకు జిల్లా పరిషత్ పాఠశాలకు స్టేజి కొరత ఉన్నప్పటికీ రోటరీ క్లబ్ సంపూర్ణ సమగ్ర సహకారంతో స్టేజి నిర్మాణాన్ని అందించి పూర్తి చేసినందుకు రోటరీ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగాలనే ఆలోచనతో స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం అన్నారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన ఆత్మనూన్యతకు లోను కాకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల తమలో అంతర్లీనంగా నిగూడమైన క్రీడలు, కళల పట్ల ఆసక్తి చూపితే జీవితంలో వారి ఎదుగుదలకు ఎంతో అని చేకూర్చుతాయి అన్నారు. స్కూలు అనేది పవిత్రమైన దేవాలయమని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని అప్పుడే మనం విజయాన్ని సాధిస్తామన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి మంచి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి కన్నీటిని తుడవాలని మంచి ఆలోచనతో సొంత డబ్బులతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ అత్యంత ప్రాధాన్యత ఉన్నదని అయినప్పటికీ మాతృభాష తెలుగు నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ విద్య సులభతరంగా అర్థమవుతుందని అన్నారు. తాను శాసనసభ్యులుగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విద్యార్థులతో నిర్వహిస్తున్న నేటి కార్యక్రమం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిందని తాను అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. శత సహస్ర వసంతాలు పాటు పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నారని మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కిట్స్, పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ శ్రేణి అత్యధిక మార్కుల సంపాదించిన విద్యార్థులకు మెమెంటోళ్లు అందించి సత్కరించారు.రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్లా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రు. లక్ష రూపాయలతో నూతనంగా నిర్మించబడిన స్టేజ్ ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించి, అనంతరం విద్యార్థులకు కంటి పరీక్షలు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం, గత ఏడది పదవ తరగతిలో నిడదవోలు పట్టణంలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. తదుపరి గవర్నమెంట్ బ్యాగ్స్ బుక్స్ గల కిట్లను మంత్రి విద్యార్థులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టిడిపి అధ్యక్షులు శ్రీ కొమ్మన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రంగా రమేష్, రోటరీ సెంట్రల్ పాస్ట్ ప్రెసిడెంట్ బి ఎన్ వి ప్రసాద్, బూరుగుపల్లి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు శ చెరుకూరి పద్మ పట్టణ ప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. .

