ఆలమూరు (కొత్తపేట):కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానంద రావుకు ఆలమూరు మండలంలో బండారు వెనువెంటే ఉంటూ అఖండ మెజార్టీకీ కీలక పాత్ర పోషించి విజయానికి కారుకులైన ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సలాది నాగేశ్వరరావును ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఉపాధ్యాయ సంఘం మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సలాది తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, రాష్ట్ర నాయకులు వైవివి రమణ, సత్యవేణి, రమేష్, శ్రీనివాస్, చంద్రమోహన్, ముస్తఫా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

