రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
పిఠాపురం :కాకినాడ జిల్లా పిఠాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ కాకినాడ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆర్గనైజర్స్ కి విశిష్ట సేవా పురస్కారం అందంచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మెంబర్, పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి అల్లవరపు నగేష్ కి ఘన సన్మానం చేసారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియ శిష్యుడు నగేష్ మాట్లాడుతూ
మానవ సేవయే మాధవ సేవ, వైద్యో నారాయణో హరిః అనే సూక్తి అక్షర సత్యం ప్రతీ రోజూ ఎంతోమంది ఆక్సిడెంట్లు ఆప్రేషన్స్ అని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులలో వారికి రక్తం చాలా అవసరం అలాంటి సమయంలో మనకు గుర్తుకు వచ్చేది రోటరీ బ్లడ్ బ్యాంక్ అందులో వున్న డా.కామరాజు గుర్తుకు వస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తాను ఇప్పటి వరకు 50 సార్లు రక్త ధనం చేయటం జరిగింది అని గుర్తుచేశారు. ఒక సంస్థను నడిపించటం అంటే ఆషామాషీ విషయం కాదు ఈ సంస్థలో డాక్టర్, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు మరియు వివిధ శాఖలు ఉద్యోగస్తులు పాల్గొని ఈ సంస్థను నడిపిస్తున్నారు వారికి చేతుయెత్తి నమస్కారము తెలియచేస్తున్నాను ఇక్కడకు విచ్చేసిన సేవకులు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డా.ఎస్ సి హెచ్ ఎస్ రామకృష్ణ, కార్యదర్శి వివి వి వర్మ, ట్రెజరర్ వీర్రాజు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు


