ఎటపాక : ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామి రెడ్డి, పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్ధా ఆదినారాయణ, చేతుల మీద నుంచి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి, బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ సొంత ఊరికి, మంచి పేరు తీసుకురావడమే కాకుండా, మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించి జీవితంలో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అంతేకాకుండా తల్లి తండ్రి, తర్వాత గురువు దైవం వీరి పట్ల విద్యార్థులు ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్ధా ఆదినారాయణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, బుద్ధా దేవి, వార్డు మెంబర్ బుద్దాసాగర్ ఉపాధ్యాయులు, బద్ది ప్రసాద్, వెంకటరమ, మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.