— 1753 కోట్ల టర్నోవర్తో
రాష్ట్రంలో రెండవ స్థానం
— బ్యాంక్ చైర్మన్ రవీంద్ర
కాకినాడ:ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ్ నెం. సి- 750 (కెసిటివి)13.93 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని అలాగే రాష్ట్రంలో 46 సహకార కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ఈ టౌన్ బ్యాంకు 1753 కోట్ల టర్నోవర్లతో రెండో స్థానంలో ఉందని బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర పేర్కొన్నారు. గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు 45వ వార్షిక ఆడిట్ నివేదిక ఆర్థిక వివరాలను సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్థం కోసం రానున్న కాలంలో నర్సీపట్నం, నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, పిఠాపురంలలో నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేసే యోజనలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 1056 బ్యాంక్ డిపాజిట్లు గాను 696 కోట్లు రుణాలు, వడ్డీ 447 కోట్ల రూపాయలు ఉన్నట్లు చెప్పారు. బ్యాంకుకు 172 కోట్ల స్వంత నిధులు ఉన్నట్లు చెప్పారు. ప్రతీ ఖాతాదారుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని అలా చేయడం వల్ల ఎటువంటి రుసుములు బ్యాంకు నుంచి వసూలు చేయబడవన్నారు. బంగారు వస్తువులపై ఒక వ్యక్తికి నాలుగు లక్షల రూపాయలు వరకు ఇస్తామని దీనికి ఇటువంటి చార్జీలు తీసుకోమని రవీంద్ర చెప్పారు. తమ బ్యాంకు ఆయా బ్రాంచీల పరిధిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుకు 53వేల 360మంది సభ్యులు ఉన్నారన్నారు. బ్యాంకులో ఒక వ్యక్తికి అత్యధికంగా రెండు కోట్ల వరకు రుణాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్, డైరెక్టర్లు కంటిపూడి వివి సత్యనారాయణ, రిమ్మలపూడి ధర్మేంద్ర, సీఈవో సి సుగుణ రావు, సహా సీఈవో బిఎస్వి సుహాస్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

