లక్కిరెడ్డిపల్లె :జూన్ 26 అంతర్జాతీయ మత్తు మాదక ద్రవ్యాలకు వ్యతిరేక దినోత్సవం అని W.H.O వారు పేర్కొనడం జరిగింది.
లక్కిరెడ్డిపల్లెలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వారు ఉన్నత ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీ ,విద్యార్థులతో హై స్కూల్ దగ్గర నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎస్.ఇ.పి అధికారి జి .చంద్రశేఖర్, మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత శిఖరాలకు చేరాలని కోరారు. అంతేకాదు విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జబీబుల్లా మరియు ఎస్. ఈ .పి సిబ్బంది, మరియు బాలికల, బాలుర ఇరువురి పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు వారు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


