హిందూపురం టౌన్ :చిన్నారుల్లో లోపాలు గుర్తించేందుకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం లో భాగంగా వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు బుధవారం శిక్షణా తరగతులు జరిగాయి. పట్టణంలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి మీటింగ్ హాలు లో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల చిన్నారులలో కలిగే పలు లోపాలను గుర్తించేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మంజువాణి, జిల్లా బాల స్వాస్థ్య కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డా.నివేదిత తెలిపారు. స్థానిక ప్రముఖ చిన్న పిల్లలు వైద్యులు ప్రేమ్ కుమార్ చిన్నారుల్లో లోపాలను గుర్తించడంపై సూచనలు చేశారు. ఇందులో భాగంగా చిన్నారులలో పుట్టుకతో వచ్చే లోపాలు, అంగవైకల్యం, అభివృద్ధి లో లోపాలు, పోషకాహారం లోపం వల్ల వచ్చే వ్యాధులు,చలన,వినికిడి, మాట్లాడటంలో,గ్రహించటంలో, చూపులో తదితర లోపాలు గుర్తించే విధానం తెలియజేస్తూ ముందస్తుగా గుర్తించి,డిఇఐసి,హిందూపురం నకు పంపుటవలన ఇక్కడి ప్రత్యేక శిక్షకులు అటువంటి వారికి అవసారనుగుణంగా శిక్షణ ఇచ్చి వారి జీవితంలో పురోభివృద్దికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమం లో జిల్లా అధికారి కార్యాలయ సిబ్బంది హరి,స్థానిక సిబ్బంది రఘురామ్, డాక్టర్ అపర్ణ,ఆప్తోమెట్రీషియన్ సాయిక్రిష్ణ,సోషియల్ వర్కర్ మోహన్ రెడ్డి యల్.టి చందన తదితరులు పాల్గొన్నారు.

