బుట్టాయగూడెం :నిస్సహాయులకు సహాయం అందించడంలో జనసైనికులు ఎప్పుడూ ముందుంటారనే నమ్మకాన్ని కొమ్ముగూడెంకు చెందిన జనసైనికులు మరోసారి నిలబెట్టారు. తాము చేయగలిగిన సహాయాన్ని చేయడమే కాక, మరికొందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మండలంలోని కొమ్ముగూడెం ఎస్సీ కాలనీకి చెందిన నాయనరపు బాబురావు అనే వ్యక్తికి షుగర్ వ్యాది కారణంగా ఒక కాలు తీసివేశారు. దీనితో ఆటో నడుపుతూ జీవనం సాధిస్తున్న బాబురావు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కుటుంబ పోషణ కూడా బరువైంది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు తమవంతు సహాయంగా బుధవారం వెయ్యి రూపాయలు నగదు, 4 వేల రూపాయల విలువచేసే నిత్యావసర సరుకులు బాధిత కుటుంబానికి ఇంటి వద్ద అందించారు. ఈ విషయం తెలుసుకున్న బుట్టాయగూడెం వినాయక ఐరన్ స్టోర్స్ యజమాని ఖాదర్ బాబు తన వంతు సహాయంగా వెయ్యి రూపాయల నగదును అందించి, బాధితు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసరి మాణిక్యాలరావు, గొడుగు నాగ శేషు కుమార్, ఆకుల వీర్రాజు, మాదేపల్లి నాని, ఆకుల పవన్, వేపవాసు, తదితరులు పాల్గొన్నారు.


