అధ్యక్షులు_ సత్యనారాయణ
ప్రజాభూమి, కామవరపుకోట
యుటిఎఫ్ లో ఉన్న ఉపాధ్యాయ ల సమస్యలను సత్కారం పరిష్కరిస్తామని నూతనంగా ఎన్నికైన యుపిఎఫ్ అధ్యక్షులు నల్లమోతుల సత్యనారాయణ అన్నారు. గురువారం కామవరపు కోట మండలంలోని స్థానిక ఆఫీసులో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గానికి జిల్లా కార్యదర్శిలు నంబూరు రాంబాబు కోట మండల ఇన్చార్జి జి దేవానంద్ ఆధ్వర్యంలో ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహింప చేశారు. గౌరవ అధ్యక్షులుగా వి ఎస్ ఆర్ ఎస్ ఆచార్యులు ఉపాధ్యక్షులుగా మల్ల రాజా సహాయ అధ్యక్షులుగా ఎన్ వి వి కనకదుర్గ ప్రధాన కార్యదర్శిగా ఏ భూషణరాజు కోశాధికారిగా డి అబ్రహమును ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా దాసిరాజు టి సత్యనారాయణ పి సాయి ప్రసాదు వి రవికుమార్ ఎన్ సుధీర్ సిహెచ్ పల్లాలు బి రాములు మహిళా కార్యదర్శిగా సావిత్రిని ఎన్నుకొన్నారు జిల్లా కౌన్సిల్ మెంబర్గా కే పాలు కే గోపాల్ ను ఎన్నిక చేశారు.