జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో సామూహిక యోగాసనాల నిర్వహణ

- ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీలు
అనంతపురము
నగరంలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. స్థానిక ఆయూష్ విభాగం, జిల్లా పోలీసు శాఖలు సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ గౌతమిశాలి పాల్గొన్నారు. చిన్ముద్ర, జ్ఞానముద్ర, నమస్కార ముద్ర, ప్రార్థనలతో ప్రారంభించి పలు యోగాసనాలను సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, జడ్పీ సి.ఇ.ఓ. మైఖోమ్ నిదియ దేవి, నగర పాలక సంస్థ కమీషనర్ మేఘ స్వరూప్, అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి, అనంతపురం ఆర్డీఓ గ్రంథి వెంకటేష్, డీఎస్పీ టి.వి.వి. ప్రతాప్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, ఆయుష్ విభాగం డాక్టర్ తిరుపతి నాయుడు, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థానిక శాఖ నిర్వాహకులు, పలువురు సి.ఐ.లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్సై లు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

