ప్రజా భూమి, కామవరపుకోట
కామవరపుకోటలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి ఆలయంలో అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మాల ధారణ చేసిన స్వాములందరికీ మండలం బాటు బిక్షలను ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని ఆలయ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శ్రీను అన్నారు. మంగళవారం జరిగిన 28వ రోజు భిక్ష కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తుమ్మలపల్లి శ్రీను దంపతులు పాల్గొని స్వాములకు వడ్డన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మలపల్లి శ్రీను మాట్లాడుతూ అన్నదాన కమిటీ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత ఏడేండ్లుగా అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మాల ధారణ చేసిన స్వాములకు ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మ కర్త కొండూరు శ్రీదర్, అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.