సర్పంచ్ అనూష భాగ్యరాజ్
ప్రజాభూమి, కామవరపుకోట
విద్యార్థులు విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు ఉన్నత పదవులు అధిరోహించాలని అనూష భాగ్యరాజ్ అన్నారు.
శాఖా గ్రంథాలయం కామవరపుకోట 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో సందర్భంగా ముగింపు సభ మరియు బహుమతులు ప్రధానోత్సవం జరిగింది స్థానిక ఎంపీపీ స్కూల్ నందు నిర్వహించడ మైనది. ముందుగా కామవరపుకోట గ్రామ సర్పంచ్ అనూష భాగ్యరాజు మాట్లాడుతూ పిల్లలు ఇప్పటినుండి గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదువుకోవాలని ప్రతి ఒక్కరు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉప సర్పంచ్ మేడూరి రంగబాబు సహాయ ఫౌండేషన్ చైర్మన్ వీరమల్ల మధు,సహాయ ఫౌండేషన్ సలహాదారు టీవీఎస్ రాజు, మరియు ఎం ఈ ఓ-2 చిన్నం ప్రశాంత్ కుమార్ ఎంపీపీ స్కూల్ హెచ్ ఎం కె పాల్ , మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు జడ్పీహెచ్ స్కూల్ సోషల్ టీచర్ వి సుశీల కుమారి విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది యం భీమరాజు మొదలగువారు పాల్గొన్నారు.