- నలుగురు మాజీ సైనికులను సత్కరించిన కలెక్టర్

అనంతపురము :నగరంలో కార్గిల్ దివస్ అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆర్మీ కల్నల్ మనోజ్ కుమార్ నాయర్ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు జరుగుతున్న ర్యాలీ నేపథ్యంలో ఉదయం స్థానిక పీటీసీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న నలుగురు మాజీ సైనికులను సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పి తిమ్మప్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో కెప్టెన్ పట్నం ఉమామహేశ్వరరావు, సార్జెంట్ సంజీవ కుమార్, సుబేదార్ మహమ్మద్ ఇర్షాద్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ టి.కె.కృష్ణ, తదితరులున్నారు. తదనంతరం జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు ఆర్ఎస్ నాగరాజ్, తిమ్మారెడ్డి, పెంచలయ్య ,వై ప్రసాద్, గొల్ల ఈశ్వరయ్య, బి ఏ హుస్సేన్, అల్లాబక్ష్, సాయికుమార్, సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది గిరీష్, బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.