Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలురాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు అన్యాయం

రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు అన్యాయం

ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధి ఎన్ తులసి రెడ్డి…..

కడప సిటీ :శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినముఖ్యమంత్రికి, మంత్రులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక రాజకీయ పార్టీగా బాధ్యతాయుతంగాతనపాత్రను పోషిస్తుంది. మంచి జరిగితే అభినందిస్తుంది. అన్యాయం జరిగితే నిర్మొహమాటంగా ఎత్తి చూపిస్తుంది.నిన్నటిరోజుముఖ్యమంత్రిచేసినఐదుసంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. సంతకాలతోనే సరిపెట్టకుండా వాటినిశీగ్రగతినఅమలుచేయాలని తులసిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేలుప్రభుత్వఉద్యోగాలుఖాళీగా ఉన్నాయన్నారు. అందులో మెగా డీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందలనలబైఏడు ఉపాధ్యాయపోస్టులుభర్తీచేటందుకు మెగా డీఎస్సీ ఫైల్ పైతొలి సంతకంచేయడంసంతోషం.కానీ ఇంకారెండులక్షలపద్నాలుగు వేలు రాష్ట్రప్రభుత్వఉద్యోగాలు ఖాళీగాఉన్నాయనివాటినికూడాత్వరలోభర్తీచేయాలనితులసిరెడ్డివిజ్ఞప్తిచేశారు.కేంద్రమంత్రివర్గకూర్పులోరాష్ట్రానికిఅన్యాయం జరిగింది.ఇరవై తొమ్మిది
మంది పార్లమెంటు సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్కుఐదుమంత్రి పదవులు;ఇరవైఎనిమిదిమంది పార్లమెంటుసభ్యులుఉన్నకర్ణాటకకుఐదుపదవులు;ఇరవైఆరుమంది పార్లమెంటు సభ్యులు ఉన్నగుజరాత్కుఐదుమంత్రిపదవులు;ఇరవైఐదుమందిపార్లమెంటు సభ్యులు ఉన్న రాజస్థాన్కుఐదుమంత్రిపదవులుఇవ్వగా,ఇరవైఐదుపార్లమెంట్ సభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 3 మంత్రి పదవులు ఇవ్వడం మాత్రమే జరిగింది. ఈ విధంగా కేంద్ర మంత్రివర్గం పదవుల్లో రాష్ట్రానికి అన్యాయంజరిగింది. తెలుగుదేశం పార్టీ పట్ల నరేంద్ర మోడీ చిన్నచూపు చూడడం జరిగిందన్నారు.కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవుల్లో 1 పార్లమెంటు సభ్యులు ఉన్న బీహార్కుచెందిన హెచ్.ఏ.ఎం.పార్టీకిఒకక్యాబినెట్ పదవి,రెoడు పార్లమెంటు సభ్యులు ఉన్న జె.డి.ఎస్. కు ఒక క్యాబినెట్పదవి,ఐదుమంది పార్లమెంటు సభ్యులు ఉన్న ఎ.ల్జే.పి.కుఒకక్యాబినెట్ పదవి ఇవ్వగా,పదహారుమందిపార్మెంట్ సభ్యులు ఉన్న తెలుగుదేశం పార్టీకికూడాఒకక్యాబినెట్ఇవ్వడంజరిగింది.అదికూడాసామాన్యులకు సంబంధంలేని పౌర విమాన శాఖ ఇవ్వడమైనది.
జనసేనపార్టీనిపూర్తిగానిర్లక్ష్యం చేయడమైనది.
ఒక్క(1) ఎంపీ ఉన్న హెచ్ ఏ ఎం పార్టీకి ఒక్క(1) క్యాబినెట్ పదవి, రెండు(2) ఎంపీలు ఉన్న జెడిఎస్ కు ఒక్క(1) క్యాబినెట్ పదవి ఇవ్వగా, రెండు(2) ఎంపీలు ఉన్న జనసేనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు.రాష్ట్ర మంత్రివర్గం కూర్పులోకడపజిల్లాకుఅన్యాయంజరిగిందిఅన్నారు.ఆంధ్రప్రదేశ్లోఐర్వయారుజిల్లాలుఉన్నాయి.నిబంధనలప్రకారంముఖ్యమంత్రితోసహాఇరవైఆరుమందికిమంత్రి పదవులు ఇవ్వవచ్చు. కానీ కడప జిల్లాకు ఒక్క మంత్రి పదవికూడా ఇవ్వలేదు జిల్లాలో తెలుగుదేశంపార్టీతరఫునకడప జిల్లాలోనలుగురు,మిత్రపక్షమైనభారతీయజనతాపార్టీతరఫునఒకరుగెలిచినప్పటికీ ఒకరికి కూడామంత్రిపదవిఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇది కడపజిల్లాకుఅవమానం.గతంలో ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నఈజిల్లానునిర్లక్ష్యంచేయడంఏమాత్రంసమంజసంకాదన్నారు.అన్నమయ్యజిల్లారాయచోటినియోజకవర్గంనుండితెలుగుదేశంపార్టీఎమ్మెల్యేగాగెలిచిరాష్ట్ర మంత్రిఅయినమండిపల్లి రాంప్రసాద్ రెడ్డికిఅభినందనలు శుభాకాంక్షలుతెలిపారు.జిల్లాలోకాంగ్రెస్పార్టీపరిస్థితి కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంకంటేకొంతవరకుమెరుగైందని రేండువేల పందోనిమిది ఫలితాలతోపోలిస్తేరేండువేలఇరవైనాలుగులోమెరుగైనఫలితాలు వచ్చాయని తులసి రెడ్డి అన్నారు. కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి2019లో 8341 ఓట్లురాగా,2024లో 1,41,039 ఓట్లు వచ్చాయన్నారు. కడప అసెంబ్లీలో 2019లో 1863 ఓట్లు రాగా, 2024లో 24,500 ఓట్లు వచ్చాయని;పులివెందుల అసెంబ్లీలో 2019లో 1230 ఓట్లు రాగా, 2024 లో 10083 ఓట్లువచ్చాయని;,జమ్మలమడుగు అసెంబ్లీలో 2019లో 570 ఓట్లు రాగా ,2024 లో 4222ఓట్లువచ్చాయని;ప్రొద్దుటూరు అసెంబ్లీలో 2019లో 2454 ఓట్లు రాగా, 2024 లో 616ఓట్లువచ్చాయని;మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2019లో3617ఓట్లురాగా2024లో4579ఓట్లువచ్చాయన్నారు. బద్వేలు నియోజకవర్గంలో 2019లో2337ఓట్లురాగా,2024లో7366ఓట్లువచ్చాయన్నారు. ఎంపీ అభ్యర్థికి 11 శాతం ఓట్లువచ్చాయన్నారు.రాజకీయాల్లోజయపజయాలుసహజమని, కాంగ్రెస్నాయకులునిరాశ, నిస్సృహకులోనుకావద్దని,ద్విగుణీకృతఉత్సాహంతోపనిచేద్దామని,ప్రజాసమస్యలపరిష్కారానికిపోరాటాలుచేద్దామనితులసిరెడ్డిపిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో అబ్దుల్ సత్తార్, అబ్దుల్ ఖాన్, సలావుద్దీన్, వెంకటరమణారెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు,ఖాదిర్, కదిరి ప్రసాద్ గౌడ్, శ్యామలమ్మ, నాగరత్న గౌడ్,రాజా, చిన్న కుల్లయప్ప,రమాదేవి,మల్లికా బేగం,వెంకటరమణ,సురేష్ ఉత్తన్న,అమర్,వినయ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article