Monday, February 16, 2026

Creating liberating content

సినిమాపెళ్లి పత్రికలు పంచుతున్న వరలక్ష్మి శరత్ కుమార్

పెళ్లి పత్రికలు పంచుతున్న వరలక్ష్మి శరత్ కుమార్

నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే ఓ ఇంటి వారు కాబోతున్నారు. ముంబయి ఆంట్రప్రెన్యూర్, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమెకు కొన్నాళ్ల కిందట నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. జులైలో వీరి వివాహం జరగనుంది.
ఈ నేపథ్యంలో, వరలక్ష్మి తన పెళ్లికి రావాలంటూ ప్రముఖులకు శుభలేఖలు పంచుతున్నారు. రవితేజ, మురళీ శర్మ, తమన్, కిచ్చ సుదీప్, అడివి శేష్, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, యర్నేని నవీన్, ప్రశాంత్ వర్మ తదితరులకు ఆమె పెళ్లి కార్డులు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article