జనసేనాని పవన్ కల్యాణ్ నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి లభించడంతో మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్నంటోంది. ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న కేసరపల్లి ఐటీ పార్కు వద్దకు మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో విచ్చేశారు. నాగబాబు, సురేఖ, సాయిదుర్గాతేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు వేదిక వద్దకు చేరుకున్నారు.

