Friday, May 9, 2025

Creating liberating content

తాజా వార్తలుబెయిల్ పై పదేళ్లుగా ఊగిసలాడే విజయసాయిరెడ్డికి లోకేష్, భువనేశ్వరిని విమర్శించే స్థాయి లేదు

బెయిల్ పై పదేళ్లుగా ఊగిసలాడే విజయసాయిరెడ్డికి లోకేష్, భువనేశ్వరిని విమర్శించే స్థాయి లేదు

వ్యక్తిగత విమర్శలు మాని ప్రజలకు ఏదన్నా చేయడానికి ప్రయత్నించు

వైసీపీలో కనుమరుగవుతున్నందునే టీడీపీపై లేనిపోని విమర్శలు

  • కింజరాపు రామ్మోహన్ నాయుడు

వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం కనుమరుగవుతోంది…దాన్ని భర్తీ చేసుకునేందుకు ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి దోచుకున్న అక్రమ సొమ్ములో నీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి. విధానపరమైన విమర్శలు చేయడం రాని మీరు..రాజ్యసభ సభ్యులుగా ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఉత్తరాంధ్రలో భూ కబ్జాల భాగోతం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాం వరకూ నీ వాటా ఎంతో తెలుసు. చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఆయన అనుమతి కోసం పిల్లిలా తిరిగిన నువ్వు విమర్శిస్తావా.? లోకేష్, భువనేశ్వరిపై విమర్శలు చేసే అర్హత నీకు లేదు. లోకేష్, భువనేశ్వరి చేపట్టే సేవా కార్యక్రమాల్లో ఒక్క శాతమైనా నువ్వు చేయగలవా.? కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తి లోకేష్ అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తు ఉన్నా సేవా కార్యక్రమాలు నిర్వహించే మాతృమూర్తి భువనేశ్వరి. విశాఖ నడిబొడ్డునున్న రూ.2 వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్ని బినామీలతో దోచుకున్నావు. 108 అంబులెన్సుల కొనుగోళ్లలో అల్లుడితో కలిసి రూ.307 కోట్ల ప్రజల సొమ్ము దిగిమింగారు. కేసుల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, పార్టీని తాకట్టుపెట్టుకున్న మీరా టీడీపీ గురించి మాట్లాడేది.? అక్రమాస్తుల కేసులో ఏ1 జగన్ రెడ్డితో పాటు..ఏ2గా ఉన్న నువ్వు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, తప్పుదారి పట్టిస్తూ పదేళ్లుగా బెయిల్ పై ఊగిసలాడే నువ్వా చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించేది. షరతులతో బెయిల్ పై ఉన్న నువ్వు అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నావు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తంతే ప్రకాశం జిల్లాలో పడ్డావ్..అక్కడి వాసులు తంతే రేపు ఎక్కడ పడతావు తెలీదు. గజదొంగల ముఠాకు మేస్త్రీగా ఉన్న నువ్వు ఏపీలో పుట్టడం ప్రజల దౌర్భాగ్యం. నీ స్థానం, నీ గమ్యం ఎప్పటికైనా కటకటాలే. ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటావ్..ఏపీలో డాంభికాలు పలుకుతావ్..ఇదీ నీ చరిత్ర. ప్రజలు ఇచ్చిన గౌరవ స్థానాన్ని వారికి మంచిచేయడానికి ఉపయోగించుకో…లేదంటే ప్రజల్లో నీ మనుగడ కష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article