ఆగిపోయున కళా హృదయాన్ని మళ్లీ బ్రతికిస్తాం…
ఎవరెన్ని కుట్రలు చేసిన చేదిస్తాం….
ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే అంతే ముందుకు సాగుతాం
ఒక్కరికోసం మా ఆశయాలు వదులుకోము…
గతం ఒక పీడ కల.. వర్తమానమే ముఖ్యం ..
మురుగా ట్రస్ట్ మంచికోసమే పనిచేస్తుంది…

ఎవరెన్ని బెదురింపులు చేసినా
ముందుకే సాగుతాం…
మీ కుట్రలు కుతంత్రాలు పనిచేయవ్…
ఈ నెల 27న మురుగా ట్రస్ట్
ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం ..
అందరూ ఆహ్వానితులే : సంతోష్ నాయుడు
విజయవాడ:-మురుగా ట్రిస్ట్ వ్యవస్థాపకుడు రమాశంకరుడి ఆశయాలే ముజ్యమని అందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించిన సహించేది లేదని రమా శంకరుడి సోదరుడు సంతోష్ నాయుడు అన్నారు.ఈ నెల 27 వతేదీన తన సోదరుడిని స్నారించుకుంటు గొప్ప కార్యక్రమం విజయవాడ గ్రంధాలయంలో ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.
గత కొన్ని రోజులుగా మురుగా ట్రిస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏమి చెయలేదని తమ్ముడి ఆశయాలు ఆగిపోకుండా, కళాహృదయం మళ్లీ చిగురించాలని కళామతల్లి సేవలో తరించి కళామతల్లి కోసం పరితపించిన రమాశంకరుడి సేవలు మళ్లీ పూర్వవైభవం తెచ్చుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నామని సంతోష్ నాయుడు తెలిపారు.
అయితే కార్యక్రమం నిర్వహణ ,ఆకార్యక్రమ జయప్రదం కోసం కొంతమంది కళాసంస్థల అధినేతలతో తమ అభిప్రాయాలను పంచుకోగ విస్తుపోయే నిజాలు తెలిసాయని సంతోష్ నాయుడు ప్రజాభూమి తో వాపోయారు.ఇప్పటికే మురుగా ట్రస్ట్ పేరుతో కొంతమంది చందాలు వసూలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని నేడు తామే స్వయంగా రంగంలోకి వస్తుండటంతో జీర్ణించుకోని కొంతమంది కార్యక్రమ నిర్వహణ ను కూడా అడ్డుకుంటామనే రీతిలో సూచనలతో కూడిన హెచ్చరికలు చేయడం అచ్చర్యానికి గురిచేస్తోందన్నారు.మురుగా ట్రస్ట్ కార్యక్రమాలు అడ్డుకునేవారి పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని సంతోష్ నాయుడు ఎవరెన్ని కుట్రలు,కుతంత్రాలు చేసిన ,బెదిరింపులకు పాల్పడిన అందరూ ఆహ్వనితులేనని ఎవరి పప్పులు ఇక్కడ ఉడకవని ఎవరెన్ని రకాలుగా ఏదో చేయాలని ఉహించుకొన్న అవేమి ఇక్కడ జరగవని ఇంత నీచ సంస్కృతి ఉందని తాము అనుకోలేదని అవసరమైతే అన్ని వివరాలు మీడియాకు తెలియపరుస్తామని సంతోష్ నాయుడు సూచించారు.