ఆదర్శ్ కళాశాల చైర్మన్ అను బాబు
ప్రజాభూమి, గొల్లప్రోలు
విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆదర్ష్ కళాశాల చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు సూచించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అనురాధ మాట్లాడుతూ..ప్రభుత్వ కళాశాలలో వసతులు, సౌకర్యాలు వినియోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని తెలిపారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వై వి ఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. సమయపాలన, కార్యదీక్షత వంటి మంచి లక్షణాలు అలవర్చుకొని పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆశించారు. అనంతరం కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అఖిలేష్, వివిధ బ్రాంచుల విభాగాధిపతులు, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.