12 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం దివాలా తీసింది.
అభివృద్ధికి ఆమడ దూరం లో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోయింది
ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితి
ఒంటిమిట్ట:ఆంధ్ర రాష్ట్రంలో అత్యవసరమైన వైద్య రంగానికి కూడా నిధులు కేటాయించలేని దుర్భర ఆర్థిక పరిస్థితి నేడు నెలకొనడంతో రాష్ట్రానికి చంద్రబాబు గారు తప్ప మరెవరు సాటి రారని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన పట్టం కట్టారు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కల్లుగీత మాజీ స్టేట్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు గురువారం నాడు టిడిపి నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అహంకారపూరిత ధోరణి వలన ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లను ఎన్డీఏ కూటమి కైవాసం చేసుకుని తగిన విధంగా ఓటర్లు బుద్ధి చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మాఫియాను ల్యాండ్ మాఫియాను మైన్ మాఫియాను వైన్ మాఫియాను తన అడ్డగోలు సంపాదన కు ఎంపిక చేసుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం లోని మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకోవడం జరిగింది రాష్ట్రం లోని సహజ వనరులన్నీ దోపిడీకి గురయ్యాయి ఈ ముఖ్యమంత్రి ఫ్రాక్షనిస్టు ధోరణి వలన రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడింది సామాన్యుడు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది ఫలితంగా అణిచివేతకు గురికాబడ్డ అన్ని వర్గాల ప్రజలు తిరగబడి కసి కొద్ది తమ ఓట్లను ఎన్డీఏ కూటమికి వేసి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి వేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో వైసిపి నాయకుల దోపిడీ వలన వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయి. వేల కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ వలన వైకాపా నాయకులు అక్రమంగా సంపాదించారు వీటన్నిటి పైన వైసిపి పాలన జరిగిన క్రమాలు అన్నిటికైనా టిడిపి ప్రభుత్వం జరిగి దోస్తులను కఠినంగా శిక్షించాలని రాజంపేట తెలుగుదేశం పార్టీ పక్షాన నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా పోలీసులు రెవిన్యూ యంత్రాంగం వైసీపీ నాయకులకు తొత్తులుగా మారి వారి అక్రమార్జనకు ఉడుత భక్తిగా తమ వంతు సహాయ సహకారాలు అందించి అక్రమ దందాలో పాలుపంచుకున్నారు ఇలాంటి అధికారులు కచ్చితంగా శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని రాజంపేట నియోజవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన అక్రమార్కులకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒంటిమిట్ట మండలంలో జరిగిన భూ అక్రమాలను ఇసుక దందాను ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసుకొని కోట్లు సంపాదించిన నాయకుల జాబితాను అందుకు సహకరించిన అధికారుల జాబితాను తప్పక తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రకటించడం జరుగుతుంది అక్రమాలపై న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో
కరాష్ట్ర మాజీ డైరెక్టర్ శ్రీమతి ఓబినేని సుబ్బమ్మ మాజీ ఎంపిటిసి ఒంటిమిట్ట మోదుగుల నర్సింహులు రాజంపేట పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిళ్ల శ్రీహరి మాజీ సర్పంచ్, డాక్టర్ శివ కుమార్ టిడిపి సీనియర్ నాయకులు ఒంటిమిట్ట ,జి ఆదినారాయణ రాజంపేట పార్లమెంటరీ పార్టీ బ్రాహ్మణ సాధికార అధ్యక్షులు, మామిళ్ళ రామకృష్ణయ్య, పత్తి కృష్ణయ్య పసుపులేటి వెంకటరమణ ,బిసి నాయకులు చిన్న కొత్తపల్లి వెంకటేష్, పెద్దకొత్తపల్లి జవ్వాజి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.