జడ్పీటీసీ ఎమ్.రవికుమార్ రెడ్డి
ప్రజాభూమి, వేంపల్లె
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వేంపల్లె జడ్పీటీసీ ఎమ్.రవికుమార్ రెడ్డి సూచించారు. శనివారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో నూతన ఆర్ఎక్స్ గో క్లీనికల్ ఫార్మసి సర్వీస్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బి.షరీఫ్ తో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నాణ్యమైన ఔషధాలు విక్రయించాలని, అలాగే సేవాభావం కలిగి ఉండాలని సూచించారు. ప్రజల నుంచి మంచి ఆదరణ, పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్, ఏపిఐఐసి డైరెక్టర్ కె.చంద్రఓబుల్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు కె.రవిశంకర్ గౌడ్, ఎంపిటిసి హబిబుల్లా, గుర్రప్ప, రమీజా తదితరులు పాల్గొన్నారు.