తాజా వార్తలుజనసేన విజయ డంక మోగించింది:విజయలక్ష్మి

జనసేన విజయ డంక మోగించింది:విజయలక్ష్మి

పోరుమామిళ్ళ :2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానం గెలిచి విజయ డంకా మోగించిందని జనసేన వీర మహిళ విజయలక్ష్మి పేర్కొన్నారు. పోరుమామిళ్లలోని మూలవీధిలో మంగళవారం రాత్రి జనసేన గెలుపు సంబరాలను భారీ కేకులను కట్ చేసి కార్యకర్తలతో వీర మహిళలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది‌. అలాగే బుధవారం రెడ్డికొట్టాల గ్రామంలో పర్యటించి అభిమానులకు ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి విజయ ఢంకా మోగించిందని జనసేన పోటీ చేసిన 21 స్థానంలో 21 స్థానం గెలుపొంది అత్యధిక మెజార్టీ తీసుకురావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా భవిష్యత్తులో వీర మహిళలు ప్రతి మహిళకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article