Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుమోదీపై నేను చెప్పింది నిజమైంది… జగన్ గెలుస్తాడన్న నా అంచనా తప్పింది: వేణుస్వామి

మోదీపై నేను చెప్పింది నిజమైంది… జగన్ గెలుస్తాడన్న నా అంచనా తప్పింది: వేణుస్వామి

లోక్ సభ ఎన్నికల్లో తన అంచనాలు నిజమయ్యాయని… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన లెక్క తప్పిందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. దేశంలో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతుందని తాను చెప్పానని… అది నిజమైందని పేర్కొన్నారు. కానీ ఏపీలో మాత్రం జగన్ విజయం సాధిస్తారని చెప్పానని… కానీ తన అంచనాలు తప్పాయన్నారు.తాను చెప్పిన రెండింట్లో ఒకటి నిజమైందని… మరొకటి లెక్క తప్పిందన్నారు. తనకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి తాను అభిప్రాయాలను వెల్లడించానన్నారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకొని తాను ఫలితాలను చెప్పానని అన్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article