Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుకాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం జగన్… రాజీనామా సమర్పణ!

కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం జగన్… రాజీనామా సమర్పణ!

ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీడీపీ కూటమి వైపే మొగ్గుచూపుతోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉండొచ్చని చాలా అంచనాలు వచ్చినప్పటికీ, వార్ వన్ సైడ్ అన్నట్టుగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎదురులేని రీతిలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఓటమి ఖాయం కావడంతో, కాసేపట్లో సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయనున్నారు. కూటమి విజయం లాంఛనం కాగా, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు జరిగిన ప్రకారం… టీడీపీ ఒక స్థానంలో గెలిచి మరో 132 స్థానాల్లో ముందంజలో ఉండగా, జనసేన 20, వైసీపీ 16, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article