Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుమంగ‌ళ‌గిరిలో లోకేశ్, పిఠాపురంలో ప‌వ‌న్‌, తెనాలిలో నాదెండ్ల మ‌నోహర్ ముందంజ‌

మంగ‌ళ‌గిరిలో లోకేశ్, పిఠాపురంలో ప‌వ‌న్‌, తెనాలిలో నాదెండ్ల మ‌నోహర్ ముందంజ‌

ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేనాని ముందంజ‌లో ఉన్నారు. 4 వేల‌కు పైగా ఓట్ల‌ లీడ్‌తో ప‌వ‌న్ దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత వెనుకంజ‌లో ఉన్నారు. టీడీపీ 12, జ‌న‌సేన 3 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడ్‌లో ఉన్నాయి. అలాగే తెనాలిలో జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article