సీపీఐ నేతలు జాఫర్ కేశవరెడ్డి డిమాండ్
ప్రజాభూమి, అనంతపురము
జిల్లాలో కరువు పరిస్థితి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు వలసలు వెళ్తున్నారని, తద్వారా రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి వలసలు నివారించాలని సీపీఐ కార్యదర్శి సి.జాఫర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజు వారీ వేతనం రూ.600, జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి 2 రోజులు 10 పని దినాలు కల్పించాలన్నారు. శనివారం
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బ్యారేర్స్ సీపీఐ జిల్లా కార్యాలయంనందు జిల్లా అధ్యక్షులు టీ.రంగయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీ.జాఫర్, కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వేరే పనులు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస పోయే ప్రయత్నంలో భాగంగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం రూపంలో అనేకమంది మరణించడం జరుగుతున్నదన్నారు. కనుక, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి
పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇల్లులేని నిరుపేదలకు ఇంటి స్థలం కొన్ని ప్రాంతాల్లో పట్టాలు కూడా ఇచ్చారు కానీ, పక్కా గృహాలు నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పక్కా గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా
మొట్టమొదట పని చేసిన పూలకుంట సంజీవులు వర్ధంతి డిసెంబర్ 7న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగనున్నదన్నారు. గ్రామీణ ప్రజలు ఆ వర్ధంతిలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ
సమావేశంలో జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ డీ. పెద్దయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు దేవేంద్ర, శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు.